ఈమధ్య కృత్రిమ మేధతో వినూత్నమైన చిత్రాలకు ప్రాణంపోస్తున్నారు కళాకారులు. అంతరిక్షమే ఓ కల్యాణమండపమైతే, తళుకుల తారలే విద్యుత్ దీపాలైతే.. వ్యోమగామి పెండ్లికూతురి ముస్తాబులో ప్రత్యక్షమైతే.. ఆక్సిజన్ మాస్క్ చాటున నవవధువు నునుసిగ్గులు ఒలకబోసే దృశ్యం.. మనోహరం! జయేశ్ సత్యదేవ్ అనే సృజనజీవి ఆవిష్కరణ ఇది. కొద్దిరోజులుగా ఆన్లైన్లో వైరల్ అవుతూనే ఉన్నది.