పూలహారాన్ని అందంగా మార్చడానికి మనం వాడే మరువం వెంట్రుకల పెరుగుదలకూ మంచి మందు. హెయిర్ మాస్క్లంటే చాలు రోజ్మేరీ, ఆముదం… ఇలా ఏవేవో గుర్తొస్తాయి మనకు. కానీ అందుబాటులో ఉండి, తక్కువ ధరలో దొరికే సువాసనలు వెదజల్లే మరువం దెబ్బతిన్న వెంట్రుకలకు మంచి మందులా పనిచేస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్లతో పాటు యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలూ పుష్కలం. తలమీద చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చి, కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా అరికట్టే స్వభావం దీనికుంది. అంతేకాదు, వెంట్రుకల పెరుగుదలకూ.. ఈ సువాసనలు వెదజల్లే ఔషధ మొక్క ఉత్ప్రేరకంలా పనిచేస్తుందట. దీన్ని రకరకాల పద్ధతుల్లో తలకు పెట్టుకోవచ్చు.