2026 న్యూ ఇయర్ పాంచ్ పటాకా
మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది! ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్' ఎన్ని రోజులు మనతో ఉంటాయి? ఎప్పుడూ.. ఫిట్నెస్, మనీ సేవింగ్ లాంటి పాత నిర్ణయాలేనా? మితిమీరిన స్క్రీన్ టైమ్, AI, వర్క్ ప్రెషర్ల మధ్య.. మనం తీసుకునే రిజల్యూషన్స్ కూడా ఆ మార్పులకు తగ్గట్టు ఉండాలి.
మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది! ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ ఎన్ని రోజులు మనతో ఉంటాయి? ఎప్పుడూ.. ఫిట్నెస్, మనీ సేవింగ్ లాంటి పాత నిర్ణయాలేనా? మితిమీరిన స్క్రీన్ టైమ్, AI, వర్క్ ప్రెషర్ల మధ్య.. మనం తీసుకునే రిజల్యూషన్స్ కూడా ఆ మార్పులకు తగ్గట్టు ఉండాలి. మరైతే, ఈ ఏడాది మీ కోసం ఓ ఐదు కొత్త రిజల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి. అవి మీ లిస్ట్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. ప్లాన్ చేసుకుని పక్కాగా ఆచరించండి!

డిజిటల్ డిటాక్స్
- గతంలో రిజల్యూషన్ అంటే ‘చెడు అలవాట్లకు’ చెక్ పెట్టడం.. ఇప్పుడు ‘ఫోన్ పక్కన పెట్టడం’ కూడా అంతే అవసరం.
- రోజులో కనీసం 60 నిమిషాలు మీ ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉండండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి 30 నిమిషాలు, రాత్రి నిద్రపోయే ముందు 30 నిమిషాలు ఫోన్ వాడకుండా ఉండండి.
జరిగే మార్పు: ఉదయం ఫోన్ చూడకపోతే… మీ మూడ్, ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. రాత్రి ఫోన్ చూడకపోతే, నిద్ర నాణ్యత పెరుగుతుంది.
మెంటల్ హెల్త్‌కు బడ్జెట్
- లైఫ్ సెటిల్మెంట్కు మాత్రమే కాదు మానసికంగా హ్యాపీగా ఉండేందుకు బడ్జెట్ కేటాయించండి.
- మీ నెలవారీ బడ్జెట్లో 5 శాతం ‘మెంటల్ వెల్నెస్’ కోసం కేటాయించండి. జిమ్ ఫీజులు, డైట్ బడ్జెట్లు, ఫిట్నెస్ గ్యాడ్జెట్.. అంటూ ఎలా బడ్జెట్ ప్లానింగ్ చేస్తున్నారో.. మనసుకి రిలాక్సేషన్ ఇచ్చే వాటిపైనా కొంత ప్లానింగ్ అవసరం.
జరిగే మార్పు: ఈ డబ్బును థెరపిస్టును కలవడానికి, యోగ క్లాసులకు వెళ్లడానికి, అభిరుచులు (పుస్తకాలు, మ్యూజిక్) పెంచుకోవడానికి వాడండి.

సే నో టూ వర్చువల్
- సోషల్ మీడియా పెరిగాక, నిజమైన కనెక్షన్లు తగ్గిపోయాయి. అందరికీ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నాం. ఎమోజీలు, జిఫ్లతో కాసిన్ని ఏమోషన్స్ పంచుకుంటున్నామంతే. ఈ వర్చువల్ మీట్‌కు బై చెప్పండి. మిత్రులను నేరుగా కలవండి.
- ప్రతి నెలా కనీసం ఒక పాత స్నేహితుడిని లేదా బంధువును కలవండి. సాధ్యపడకపోతే కనీసం వీడియో కాల్ అయినా చేయండి.
జరిగే మార్పు: జీవిత లక్ష్యాలను అందుకోవడానికి మానవ సంబంధాలను మించిన వారధి లేదు. మనవారితో జరిపే సంభాషణలు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి.
అతి షేరింగ్ వద్దు
- ‘ప్రతి నిమిషం అప్ టూ డేట్‌గా ఉంటారు.. వాళ్లు గ్రేట్’ అంటూ.. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూపిస్తున్న ‘పర్ఫెక్ట్ లైఫ్’ నుంచి దూరం జరగండి. అలా ఉండకపోతే వాల్యూ ఉండదనే భ్రమల్లోంచి బయటపడండి.
- ప్రతి మంచి విషయాన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను వెంటనే పోస్ట్ చేయాలనే ఆరాటం వదిలిపెట్టండి. ఆ క్షణాన్ని మీకు మీరుగా అస్వాదించండి.
జరిగే మార్పు: సోషల్ మీడియా వాలిడేషన్ కోసం ఆశ పడటం మానేస్తే, మీ స్వీయ-గౌరవం పెరుగుతుంది. మీరు రిలాక్స్డ్గా, సంతోషంగా ఉంటారు.
మరేదైనా ‘స్కిల్’
- చేస్తున్న పనితో సంబంధం లేకుండా ఏదైనా కొత్త స్కిల్‌ని అభ్యాసం చేయడం అవసరం. మన సృజనాత్మకతకు ఇదో చక్కని అటెంప్ట్ అవుతుంది.
- డిజిటల్, వర్చువల్ లైఫ్‌కి సంబంధం లేని ఒక కొత్త స్కిల్‌ను ఈ ఏడాది నేర్చుకోండి. అది డ్రాయింగ్, కొత్త భాష, వంట, గార్డెనింగ్ ఏదైనా సరే.. కొత్తది నేర్చుకోండి.
జరిగే మార్పు: కొత్త స్కిల్ నేర్చుకోవడం వల్ల మెదడుకు కొత్త వ్యాయామం దొరుకుతుంది. ఇది మీ పని ఒత్తిడి నుంచి విరామం ఇస్తుంది. అంతేకాదు.. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

