శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Komarambheem - Jan 22, 2021 , 00:25:41

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • బెల్లంపల్లి ఏరియా జీఎంకు టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు  శ్రీనివాసరావు వినతి

రెబ్బెన,జనవరి21 : బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు కోరారు. ఏరియా లోని గోలేటి జీఎం కార్యాలయంలో గురువారం ఏరియా జీఎం బీ సంజీవరెడ్డితో కార్మికుల సమస్యలు, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలోని కొవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్‌ ఎత్తివేసి, కార్మికులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, అవుట్‌ పేషెంట్‌ గైనకాలజిస్ట్‌, స్పెషలిస్టులను నియమించాలని కోరారు.  ఏరియా వర్క్‌షాప్‌లో మోటార్‌షెడ్డు ఏర్పాటు చేయాలని, ఫిల్టర్‌ బెడ్‌ నుంచి నీటి సరఫరా చేయాలని, లైబ్రరీ తెరవాలని, జిమ్‌ను వేరే బిల్డింగ్‌లోకి మార్చాలని, ఓపెన్‌ వేదిక నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించి, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ రామశాస్త్రి, టీబీజీకేఎస్‌ నాయకులు గజ్జెల్లి చంద్రశేఖర్‌, అబ్బు శ్రీనివాసరెడ్డి, మాంతు సమ్మయ్య ఉన్నారు. 

కైర్‌గూడ ఓసీపీలో సమస్యలు పరిష్కరిస్తాం..

 కైర్‌గూడ ఓసీపీ లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీబీజీకేఎస్‌ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీలో గురువారం ఆయన పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈపీ ఆపరేటర్లందరికీ ప్రమోషన్‌ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.గ్రేడ్‌ టెస్ట్‌లు నిర్వహించి, అందరికీ ప్రమోషన్లు వచ్చే విధంగా టీబీజీకేఎస్‌ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి కార్నాథం వెంకటేశ్‌, ఏరియా కార్యదర్శి పెండ్యాల అంజయ్య, జీఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేశ్వర్లు, గజ్జెల్లి చంద్రశేఖర్‌, సమ్మయ్య, నాయకులు నర్సింగరావు, మొగిలయ్య, శ్రీనివాస్‌, కిరణ్‌, రాజేశం, వామన్‌, వెంకటి, తదితరులున్నారు. 


VIDEOS

logo