మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jul 19, 2020 , 03:00:48

గనుల ప్రైవేటీకరణకు కుట్ర

గనుల ప్రైవేటీకరణకు కుట్ర

మందమర్రి : బొగ్గు గనులతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. పలు యూనియన్ల నాయకులు శనివారం టీబీజీకేఎస్‌లో చేరారు. స్థానిక కార్యాలయంలో ఐఎన్టీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్‌, ఏరియా కార్యదర్శి జీడీ బాబుతో పాటు మాలోతు బాలు, ఎండీ సర్వర్‌, తోకల వెంకటేశ్‌, లక్కాకుల మహేశ్‌, మోకనపల్లి లక్ష్మణ్‌, ఎన్‌ శివకుమార్‌, మాచెర్ల రాజేందర్‌, బడుగు స్వామిరెడ్డి, మనుబోతు రవి, హెచ్‌ఎంఎస్‌ ఏరియా నాయకుడు మోహన్‌రెడ్డి తమ అనుచరులతో చేరగా, వెంకట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డి కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కరోనా విపత్కర పరిస్థితిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, కేంద్ర ఉపాధ్యక్షుడు బడికెల సంపత్‌, ఏరియా నాయకులు రవీందర్‌, రాజశేఖర్‌, కట్కూరి సత్యనారాయణ, సీవీ రమణ, శంకర్‌రావు, కోరవేన లక్ష్మణ్‌, రమణారావు, అన్ని గనుల ఫిట్‌ కార్యదర్శులు పాల్గొన్నారు. logo