శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Jun 16, 2020 , 04:01:30

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఆసిఫాబాద్‌టౌన్‌: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని ఆసిఫాబాద్‌ సహకార సంఘం చైర్మన్‌ అలీబిన్‌ హైమద్‌ పేర్కొన్నారు. సోమవారం సహకార సంఘం కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీపై యూరియా, డీఏపీ పంపిణీ చేస్తున్న ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తగా పట్టాపాస్‌ పుస్తకాలు తీసుకున్న రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. 

కాగజ్‌నగర్‌ రూరల్‌: పట్టణంలోని పీఏసీఎస్‌లో చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు సోమవారం రైతులకు యూరియా, ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని రైతులకు సరిపడా ఎరువులు, యూరియా, 20-20 బస్తాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమున్న వారు తమ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ ప్రతులను తీసుకురావాలని సూచించారు. 

చింతలమానేపల్లి : మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏఈవో విజయ్‌ సోమవారం రైతులకు సబ్సిడీపై యూరియాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 888 యూరియా బస్తాలు వచ్చాయని అన్నారు. ఎకరాకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశామని తెలిపారు. logo