బుధవారం 08 జూలై 2020
Komarambheem - Jun 03, 2020 , 04:38:12

ఉద్యమ స్ఫూర్తితోనే అభివృద్ధి

ఉద్యమ స్ఫూర్తితోనే అభివృద్ధి

  • ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి
  • ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

ఆసిఫాబాద్‌: ఉద్యమ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేసి చూపుతున్నారని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఎస్పీ కార్యాలయం లో ఏఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గాదవేణి మల్లేశ్‌, ఎంపీపీ మల్లికార్జున్‌,  డీటీడీవో దిలీప్‌కుమార్‌, అటవీ శాఖ అధికారి వినయ్‌కుమార్‌, డీఎస్పీ సత్యనారాయణ వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ నివాళులర్పించారు.

రెబ్బెన: మండల కేంద్రంలోఎంపీపీ జుమ్మిడి సౌందర్య, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ,  సీఐ ఆకుల అశోక్‌, ఎస్‌ఐ దీకొండ రమేశ్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ భరత్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌కుమార్‌, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, వెటర్నరీ డాక్టర్‌ సాగర్‌, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, గోలేటిలో జీఎం కొండయ్య జెండా వందనం చేశారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ వేముర్ల సంతోష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, రైతు బంధు సమితి సభ్యురాలు కుందారపు శంకరమ్మ, ఏరి యా జీఎం కొండయ్య, సేవా అధ్యక్షురాలు లక్ష్మీకుమారి, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, సర్పంచ్‌లు  పాల్గొన్నారు.

జైనూర్‌: మండల కేంద్రంలో సర్పంచ్‌ పార్వతి లక్ష్మణ్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి నాగేంద్ర, సీఐ సురేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రకాశ్‌, ఐకేపీ ఏపీఎం సుజాత, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల,  ఎంపీపీ తిరుమల,  తహసీల్దార్‌ భుజంగ్‌రావ్‌, ఎంఈవో సుధాకర్‌ వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దత్తారాం, మార్కెట్‌ కార్యదర్శి దేవ న్న, ఎస్‌ఐ తిరుపతి, వైస్‌ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్‌ పాల్గొన్నారు. 

జైనూర్‌(సిర్పూర్‌(యు)): సిర్పూర్‌(యు)లో ఆదివాసీ మిత్ర సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకులు రక్తదానం చేశారు. మండల కేంద్రంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ వీణాబాయి, పీహెచ్‌సీ లో వైద్యాధికారి నరేశ్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ విష్ణువర్ధన్‌, పీఏసీఎస్‌లో చైర్మన్‌ శివాజీ, ఐకేపీలో ఏపీఎం వెంకట్‌రెడ్డి, ఎమ్మార్సీలో ఎంఈవో సుధాకర్‌, ఎంపీడీవో కార్యాలయంలోఎంపీపీ భాగ్యలక్ష్మీ, తహసీల్దార్‌ నదిముల్లాఖాన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

లింగాపూర్‌: తహసీల్దార్‌ మధూకర్‌, ఎంపీపీ సవిత,  ఎస్‌ఐ వెంకటేశ్‌, పీహెచ్‌సీ  వైద్యాధికారి సంజీవ్‌, ఐకేపీ ఏపీఎం సదానందం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. 

వాంకిడి:  మండల కేంద్రంలో ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎంఈవో మానుకుమార్‌, సీడీపీవో రెబ్కా, ట్రాన్స్‌కో ఏఈ రవీందర్‌, ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుపతి,  ఏవో మిలింద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రాణాప్రతాప్‌ జాతీయ జెండాను ఎగుర వేశారు.

తిర్యాణి: ఎమ్మార్సీలో మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి,  పశువైద్యశాలలో వైద్యాధికారి రామకృష్ణ, పీఏసీఎస్‌లో చైర్మన్‌ చుంచు శ్రీనివాస్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రామారావు, తిర్యాణి వైద్యశాలలో వైద్యాధికారి శ్యాంకుమార్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండల కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌,  తహసీల్దార్‌ మస్కూర్‌ అలీ, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, ఏవో తిరుమలేశ్వర్‌, అటవీ శాఖ రేంజర్‌ గులాబ్‌సింగ్‌ వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రశేఖర్‌, ఎంపీడీవో కుటుంబరావు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో..

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో మంగళవారం 6వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబేద్కర్‌, జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగుర వేశారు. ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ పోలీసులతో గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే గాంధీచౌక్‌లో జడ్పీవైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, తెలంగాణ తల్లి చౌరస్తాలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ విద్యావతి, రాజ్‌కుమార్‌, సీనియర్‌ సిటిజన్లు పూర్ణచందర్‌రావు, మార్త సత్యనారాయణ  జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ గిరీశ్‌కుమార్‌, ఎంపీపీ శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, సీఐ మోహన్‌, ఎస్‌ఐలు రాజ్‌కుమార్‌,  రమేశ్‌, తైసొద్దీన్‌ పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ రూరల్‌: ఆర్డీవో కార్యాలయంలో డీఏవో భౌమిక్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రమోద్‌, ఎంపీడీవో, పోలీసు, ఫారెస్టు, పీఏసీఎస్‌, వ్యవసాయ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, ఏటీడీవో కార్యాలయాల్లో  అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అంబేద్కర్‌, జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలో ఎస్‌ఐ వెంకటేశ్‌, తహసీల్దార్‌ లింగమూర్తి, ఎంపీపీ చునార్కర్‌ సువర్ణ, ఏవో మధులత, సర్పంచ్‌ తఫిమా పర్వీన్‌ వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి రేఖ, కో ఆప్షన్‌ సభ్యుడు కీజర్‌హుస్సేన్‌, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ సత్యనారయణ పాల్గొన్నారు. 

కౌటాల: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ వొజ్జల మౌనిశ్‌, పీఏసీఎస్‌లో చైర్మన్‌ కుమ్రం మాంతయ్య, ఐకేపీలో సూర్య చంద్ర మండల సమాఖ్య అధ్యక్షురాలు కుసుమ, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఆంజనేయులు,  ఏవో రాజేశ్‌, ఎంఈవో సోమయ్య, ఎంపీపీ విశ్వనాథ్‌, టీజీబీలో మేనేజర్‌ గిర్మాజి నాయక్‌, తహసీల్దార్‌ రాజేశ్వరి వారి కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు.

బెజ్జూర్‌: మండల కేంద్రంలో ఎంపీపీ డోకె రోజారమణి, తహసీల్దార్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, ఏవో రాజులనాయుడు, ఎంఈవో రమేశ్‌బాబు,  రేంజ్‌ అధికారి దయాకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అర్షద్‌ హుస్సేన్‌, ప్రభుత్వ వైద్యాధికారి రుషి  ఎస్‌ఐ సాగర్‌,  సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పార్థీరాం వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్‌, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, డీటీ రవీందర్‌, ఎంపీవో రమేశ్‌ రెడ్డి, ఈసీ రజినీకాంత్‌, ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా పాల్గొన్నారు.

దహెగాం: మండల కేంద్రంలో ఎంపీపీ  సులోచన, తహసీల్దార్‌ సాయన్న, ఎస్‌ఐ రఘుపతి, సర్పంచ్‌ పుప్పాల లక్ష్మి, పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యాధికారి చంద్రకిరణ్‌, ప్రధానోపాధ్యాయుడు పోచయ్య, ఎస్‌వో రమాదేవి, ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్‌, ట్రాన్స్‌కో ఇన్‌చార్జి ఏఈ రవీందర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కన్నం మోహన్‌బాబు, ఏఈవో శోభన్‌, బీబ్రా  వారి కార్యాలయాల్లో, ఆయుర్వేద వైద్యశాలలో వైద్యాధికారి రాజేందర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.


logo