బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 15, 2020 , 00:00:06

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

బెజ్జూర్‌ :  పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని డీఈవో పాణిని అనా ్నరు. శుక్రవారం స్థానిక కస్తూర్బా  విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు సబ్జెక్టుల్లో వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అంతేగాకుండా ఆం గ్లం, గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం గల ముగ్గు రు ఉపాధ్యాయులతో జిల్లాస్థాయిలో 15 టీములు ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం సభ్యులు మండలాల్లో పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులు సందేహాలు తీర్చుతారని పేర్కొన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎస్‌వో సుమలతకు సూచించారు. పదో తరగతి తర్వాత ఏయే కోర్సుల్లో ప్రవేశం పొం దాలి? భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియజేసేందుకు రాష్ట్ర కార్యాలయం నుంచి విద్యార్థులకు బుక్‌లెట్‌ను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌, ఫిట్‌ ఇండియా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌వోకు సూచించారు. ఈ సందర్భంగా ఆయా రిజిష్టరులను పరిశీలించారు. అంతకు ముందు ఎమ్మార్సీని సందర్శించారు. పాఠశాలల్లో ఆధార్‌ అప్‌డేట్‌ వేగవంతం చేస్తే  విద్యార్థులకు ఏక రూప దుస్తులతో పాటు ఎండీఎం, ఇతర సౌకర్యాలను సమకూర్చుట సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు. అదే విధంగా ఉపాధ్యాయులు బయో మెట్రిక్‌లోనే హాజరు వేయాలని పేర్కొన్నారు. దీనిపై సీఆర్పీలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయన వెంట సెక్టోరల్‌ అధికారులు జబ్బార్‌, అనురాధ, సీఆర్పీ శ్రీనివాస్‌, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

పెంచికల్‌పేట్‌ : స్థానిక జడ్పీ పాఠశాల, కేజీబీవీలను శుక్రవారం డీఈవో పాణిని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయని చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, అల్పాహారంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లా సెక్టోరల్‌ అధికారులు జబ్బార్‌, అనురాధ, హెచ్‌ఎం యాదగిరి, ఎస్వో కవిత ఉన్నారు. 

కౌటాల : స్థానిక ఎమ్మార్సీని డీఈవో పాణిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతిరోజు బయోమెట్రిక్‌ నమోదు చేయాలన్నారు. ఏక్‌భారత్‌, ఫిట్‌ ఇండియా కార్యక్రమాలు పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. పాఠశాలల రిపోర్టులు సకాలంలో అందించాలని ఎంఈవో సోమయ్యకు సూచించారు. సిబ్బంది పాఠశాలల పర్యవేక్షణ చేయాలని, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఓలు జబ్మర్‌, అనురాధ, సీఆర్పీలు ఉన్నారు.


logo
>>>>>>