శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 12, 2020 , 23:28:54

పల్లె అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

పల్లె అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : పల్లెల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని గుండి పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్‌ను సర్పంచ్‌ అరుణకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛత వైపు నడిపించేందుకు ట్రాక్టర్లను అందిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ పనులకే వీటిని వినియోగించుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో సాయాగౌడ్‌, గుండి ఎంపీటీసీ గాదెవేణి మల్లేశ్‌, కెరమెరి జడ్పీటీసీ దుర్ఫదాబాయి, బాబాపూర్‌ సర్పంచ్‌ లక్ష్మి, నాయకులు రవీందర్‌ తదితరులున్నారు.


logo