సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 20, 2020 , 23:40:46

ఇంద్రాదేవికి పూజలు

ఇంద్రాదేవికి పూజలు
  • -గంగాజలంతో మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశీయులు
  • -24న అర్ధరాత్రి నాగోబాకు మొక్కులు
  • - గంగాజలంతో మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశీయులు
  • - 24న అర్ధరాత్రి నాగోబాకు మొక్కులు

ఇంద్రవెల్లి: జన్నారం మండలంలోని గోదావరినదీ హస్తలమడుగు నుంచి జనవరి 14న సేకరించిన పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్‌కు బయలుదేరిన మెస్రం వంశీయులు సంప్రదాయ ప్రకా రం మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన్‌గూడ, గోండ్‌గూడ నుంచి గంగాజలంతో ఇంద్రాదేవి ఆ లయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. సహ పంక్తి భోజనాలు చేసి సాయంత్రం వరకు బస చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లతో కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో కెస్లాపూర్‌కు బయల్దేరా రు. రాత్రి కెస్లాపూర్‌ మర్రిచెట్ల వరకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగాజలంతో మెస్రం వంశీయులు మర్రిచెట్ల వద్దకు చేరుకున్నట్లు కో త్వల్‌ తిరుపతి మెస్రం వంశీయుల పటేల్‌కు స మాచారం అందించారు. హస్తలమడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం ఝరిని మర్రిచెట్ల ప్రాంతంలోని మోత్కాకు చెట్టుపై భద్రపరిచి తెల్లటి వస్త్రంతో కప్పారు. మంగళవారం రాత్రి మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు పటేల్‌తో పటేళ్లు  సమావేశం నిర్వహిస్తార న్నారు. నాగోబాకు నిర్వహించే మహా, తూమ్‌(పిండ ప్రధానం) పూజల నిర్వహణపై చర్చించించనున్నట్లు తెలిపారు. 24న మర్రిచెట్ల నుంచి గోవాడ్‌కు చేరుకుంటామని మెస్రం వంశీయులు తెలిపారు. కటోడ హనుమంత్‌రావ్‌, పర్ధంజీ తుకుడోజీ, కోసుకటోడ, గణపతి, దాదారావ్‌, నాగోరావ్‌, తిరుపతి, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.logo