నిరుపయోగంగా మారిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు..ఆటలకు దూరమవుతున్న యువత
గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కారేపల్లి,అక్టోబర్ 22: గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన మైదానాలు సరైన నిర్వహణ లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పంధించి క్రీడా ప్రాంగణాలను శుభ్రం చేసి, క్రీడలకు అనువుగా తీర్చిదిద్దాలని యువత కోరుతున్నారు.
గ్రౌండ్ అభివృద్ధికి వినతి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీలో గల క్రీడా మైదానాన్ని శుభ్రపరిచి, క్రీడలకు అనువుగా తీర్చిదిద్దాలని కోరుతూ గ్రామ యువత పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, రైల్వే తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఫిజికల్ ప్రాక్టీస్ చేసుకునేందుకు గ్రౌండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
మైదానాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. గ్రౌండ్ అభివృద్ధి చెందితే గ్రామంలోని యువతకు క్రీడల్లో రాణించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వినతిపై స్పందించిన కార్యదర్శి, సర్పంచ్ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు యువకులు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో సాయి, గణేష్, రాజేష్, అఖిల్, ఉమేష్, వినయ్, గణేష్, చరణ్, ప్రవీణ్, విష్ణు తదితరులున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

