టేకులపల్లి, సెప్టెంబర్ 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. చిన్న పంచాయతీల ఏర్పాటుతోనే పల్లెలకు కూడా నిధులు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని వివరించారు. టేకులపల్లి మండలంలో ఆదివారం పర్యటింటిన ఆమె.. రూ.2.17 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు, గ్రామ పంచాయతీల్లో చేపటిన నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా టేకులపల్లి బ్రహ్మంగారిగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం బద్దుతండా సర్పంచ్ భూక్యా చిన్ని ఆధ్వర్యంలో పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
అనంతరం ఎర్రయిగూడెం, మొక్కంపాడు, కిష్టారం, గంగారం, సంపత్‌నగర్, లచ్చగూడెం, చింతోనిచెలక, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ.. తండాలను, గూడేలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని స్పష్టం చేశారు. చిన్న పంచాయతీలుగా ఉండడం వల్లనే నిధులు సమకూరాయని, గ్రామాలు అభివృద్ధి సాధించాయని, ప్రభుత్వ ఫలాలు లభించాయని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా వంటివి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని, తనను ఆశీర్వదించి అధిక మెజార్టీ అందించాలని కోరారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు నవీన్‌కుమార్, భూక్యా చిన్ని, ఈసం నిర్మల, బానోత్ విజయ, జబ్బ విజయలక్ష్మి, జోగ రేణుక, పాయం సమ్మయ్య, ఈసం నీలమయ్య, మాలోత్ సురేందర్, జాలది అప్పారావు, రామకృష్ణ, నవీన్‌కుమార్, గన్రెడ్డి రమణారెడ్డి, బొమ్మెర్ల వరప్రసాద్‌గౌడ్, బోడు బాలునాయక్, బానోత్ రామానాయక్, బానోత్ కిషన్‌నాయక్, చీమల సత్యనారాయణ, లక్కినేని శ్యామ్‌బాబు, దళపతి శ్రీనివాసరాజు, కంభపాటి చంద్రశేఖర్‌రావు, శ్రీనివాసచౌదరి, ధరావత్ బాలాజీనాయక్, ఇస్లావత్ బాలునాయక్, జాల మురళి, బానోత్ వాలునాయక్, ఈసం అచ్చయ్య, జోగ లక్ష్మణ్, బానోత్ రవికుమార్, జాటోత్ నరేశ్, జర్పుల లచ్చునాయక్, కుమ్మరి కిరణ్, కాలే ప్రసాద్, గుగులోత్ కృష్ణ, ఉండేటి బసవయ్య, రాజు, నర్సింగ్ సుదీప్, బానోత్ రవీందర్, ఆంతోటి రాకేశ్, కాలే అభినయ్, శ్రీనివాస్, పెరుగు వెంకన్న, గంగారపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.