కారేపల్లి అక్టోబర్ 7: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా TGTWURJC సింగరేణి జూనియర్ కళాశాలకు చెందిన లెక్చరర్ యనమాల గామయ్య ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ లెక్చరర్ల సమస్యలు,ఉద్యోగుల సంక్షేమం,న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యనమాల గామయ్యకు రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్లు, అసోసియేషన్ నాయకులు,సభ్యులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు యనమాల గామయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ లెక్చరర్ల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉద్యోగుల సంక్షేమం,హక్కుల పరిరక్షణ కోసం అందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేస్తానని తెలిపారు.అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసి రాష్ట్రంలోని ప్రతి జూనియర్ లెక్చరర్‌కు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తానని గామయ్య పేర్కొన్నారు. జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు పలువురు లెక్చరర్లు అభినందనలు తెలిపారు.