ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాములు నాయక్ ఆమె కుమారులు ఆదినారాయణ,శంకరరావులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆకుతోట కొమరమ్మ చిత్రపటానికి ఆయన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై చిరంజీవి, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మాధవరావు, పలు గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు