ఎర్రుపాలెం: ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌ను బుధవారం వైరా ఏసీపీ స్నేహామెహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం సీజ్ చేసిన వెహికల్స్‌ను, పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఏసీపీ స్నేహామెహ్రా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్సై గోపాలరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.