చీటర్ కావాలా? రైతు బిడ్డ కావాలా?
నిత్యం బూతులు మాట్లాడుతూ చీటింగ్ చేసి జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో ఉద్యోగం వదిలేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాకేశ్‌రెడ్డి కావాలో పట్టభద్రులు,
- ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డిని గెలిపించి మండలికి పంపండి..
- నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు లేకుండా రేవంత్ 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?
- నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరు చుట్టినట్లయింది
- జాబ్ క్యాలెండర్ ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వం
- ఖమ్మం ఎస్బీఐటీలో జరిగిన పట్టభద్రుల సమ్మేళనంలో
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
ఖమ్మం, మే 20 : నిత్యం బూతులు మాట్లాడుతూ చీటింగ్ చేసి జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో ఉద్యోగం వదిలేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాకేశ్‌రెడ్డి కావాలో పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కళాశాల ఆవరణలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజవకవర్గ విస్తృతస్థాయి సమావేశం బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇంఛార్జ్ ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నపై 56 కేసులు ఉన్నాయని, 74 రోజులు చర్లపల్లి జైలులో ఉన్న వ్యక్తికి ఓటు వేస్తే పట్టభద్రులకు ఎలాంటి ఉపయోగం జరగదన్నారు. ఉన్నత చదువులు చదివి కేసీఆర్ పాలన మెచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాకేశ్‌రెడ్డికి ఓటు వేయడం వల్ల ప్రజా సమస్యల పట్ల నిత్యం స్పందిస్తూ ప్రజా గొంతుకగా నిలుస్తారని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు అబద్ధాలను కొంత నమ్మారని, నిజం గడప దాటేలోపు అబద్ధం అంతా చుట్టినైట్లెందన్నారు.
కేసీఆర్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. ఇది చెప్పుకునేలోపు కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఉంటే రాహుల్‌గాంధీ, మోడీలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారని, కానీ.. ఇంతవరకు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఒక్క నోటిఫికేషన్, ఇంటర్వ్యూ లేకుండా 30 వేల ఉద్యోగాలు రేవంత్‌రెడ్డి ఎలా ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పలేదని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. ఖమ్మంలో అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అయితే ప్రతిపక్షాలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేశాయని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఐటీ ఉత్పత్తులు 57 వేల కోట్ల విలువ ఉంటే.. తొమ్మిదేళ్లలో వాటి విలువ 2 లక్షల 41 వేల కోట్లకు పెంచామని గుర్తు చేశారు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చామని, 10 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ వచ్చే జనరేషన్‌ను దృష్టిలో ఉంచుకొని రాకేశ్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘గ్యారెంటీ’కి గౌరవం లేకుండా పోయింది..
-బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిల వల్ల గ్యారెంటీ అనే పదానికి గౌరవం లేకుండా పోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిజానికి, అబద్ధానికి మధ్య యుద్ధం జరుగుతున్నదని, కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి రాకేశ్‌రెడ్డి నిజం, ఆశయం, త్యాగానికి ప్రతి రూపమన్నారు. విద్య విలువ తెలిసిన రాకేశ్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపినిచ్చారు. కేసీఆర్ పదేండ్ల పాలన నిప్పు లాంటి నిజమైన పాలన అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు నాణ్యమైన విద్యను గురుకులాల ద్వారా అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తాను గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆడపిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నారని ఒక్కమాట చెప్పగానే 36 డిగ్రీ మహిళా కళాశాలలను ప్రారంభించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఇటీవల భవనగిరి, సూర్యాపేట జిల్లాలో గురుకుల విద్యార్థులు చనిపోయారని, అనేక మంది అస్వస్థతకు గురయ్యారని, అయినా సంక్షేమ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కనీసం స్పందించలేదన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేసీఆర్ ఏమి చేస్తారోనని భయం వద్దని, పాండవులు ఐదుగురే ఉన్నారని, అయినా విజయం సాధించారని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతుకను మండలికి పంపాలి..
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి
ప్రశ్నించే గొంతుకను మండలికి పంపాలని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి కోరారు. పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసగాళ్లను పంపొద్దన్నారు. ప్రతి ఒక్కరు గల్ల్లా ఎగురేసుకొని చెప్పుకునే అభ్యర్థిని మాత్రమే ఎన్నుకోవాలన్నారు. తనను గెలిపిస్తే ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన వారి గొంతుకలా పోరాడతానని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి
– మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
జిల్లా ఓటర్లు, ప్రజలు చాలా చైతన్యవంతులని, పట్టభద్రల నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ విజ్ఞతతో ఆలోచించి ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డిని ఎన్నుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్ అని, అతడికి ఓటు వేయడం వ్యర్థమన్నారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు బచ్చు విజయ్‌కుమార్, కూరాకుల నాగభూషణం, సీనియర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, నాయకులు బిచ్చాల తిరుమలరావు, వీరునాయక్, బొమ్మెర రామ్మూర్తి, కార్పొరేటర్లు, గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

