చండ్రుగొండ ,మార్చి 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గిరిజన ప్రాంతంలోని జలగం వెంగళరావు సాగునీటి ప్రాజెక్ట్‌ను మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు బుధవారం పరిశీలించారు. సీతాగూడెం గ్రామ శివారులోని అలుగు తెగిన వెంగళ ప్రాజెక్ట్‌ను పరిశీలించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు అధికంగా సాగు చేసుకునే ప్రాజెక్టు అలుగు తెగిపోవడం బాధాకరమన్నారు. పాలకులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి తెగిన అలుగును వెంటనే నిర్మించాలన్నారు.
ఈ ప్రాంతంలో గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులను జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ నెల 17న కమిషన్ బాద్యులు హుస్సేన్ నాయక్ వచ్చి తెగిన వెంగళరావు ప్రాజెక్టు, అశ్వరావుపేటలోని పెదబాబు ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలకు అతీతంగా తెగిన ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ కొనకండ్ల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దారా బాబు, సంగోడి రాఘవులు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, సీనియర్ నాయకులు మేడ మోహన్ రావు, గాద లింగయ్య, పాండ్ల అంజన్ రావు, సిపిఐ మండల కార్యదర్శి బొర్ర కేశవులు, ఆయకట్టు రైతులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Vengal Rao Project : వెంగళరావు ప్రాజెక్ట్ అలుగుని వెంటనే నిర్మించాలి : మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు