ఖమ్మం రూరల్, ఏప్రిల్ 24 : ఇటీవల మరణించిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య కుటుంబాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్తో కలిసి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం పరామర్శించారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని రామయ్య ఇంటికి వెళ్లిన లక్ష్మీనారాయణ తొలుత రామయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రామయ్య సతీమణి జానకమ్మకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన సేవలు భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. చెట్లను మనుషులుగా చూస్తూ వాటిని సంరక్షించడం ఆయన జీవిత ధ్యేయంగా మారిందన్నారు. ఆయన జీవితం ప్రకృతి పట్ల ప్రేమ, పట్టుదల, త్యాగానికి చిరునామా అన్నారు. వనజీవి రామయ్య మహోన్నత వ్యక్తి అని వారి కుటుంబానికి అండగా నిలవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
Khammam Rural : వనజీవి రామయ్య పర్యావరణ సేవలు ఆదర్శనీయం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ