ఖమ్మం, ఏప్రిల్ 4: రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ధనఖర్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు పలువురు రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతోపాటు వెళ్లి ఉపరాష్ట్రపతి సహా ఇతర ప్రముఖులను కలిశారు.