తిరుమలయపాలెం, ఏప్రిల్ 28 : తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీరామ విద్యాలయాన్ని మంగళవారం విద్యాశాఖ అధికారులు మూసివేశారు. గత ఆరేళ్లుగా పాఠశాల అనుమతిని రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల పాఠశాల యజమాని మర్రి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం పాఠశాలను సీజ్ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వెల్లడించారు. పాఠశాలను సీజ్ చేసి రికార్డులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.