ఖమ్మం రూరల్, జూలై 09 : రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లంపాడు నుండి ఖమ్మం వైపు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వస్తున్నారు. పొన్నెకల్లు గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే సమయంలో బైకు ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోవడంతో అక్కడికక్కడే ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని మెరుగైన వైద్య కోసం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించారు.