సత్తుపల్లి, నవంబర్ 30 : టీఎన్జీవో కల్లూరు యూనిట్ కార్యాలయ నిర్మాణానికి స్థలం, నిధులు ఇవ్వాలని సత్తుపల్లి టీఎన్జీవో కార్యాలయ స్థలంలో భవన నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను బుధవారం క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవో నాయకులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సండ్ర కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు అఫ్జల్ హసన్, సాగర్, విజయ్‌ప్రకాశ్, కృష్ణ, నజీరుద్దీన్, తమర్జన్ పాల్, నందగిరి శ్రీను, పవన్‌కుమార్, రవి, ధరావత్ భాస్కర్, పుల్లయ్య, నాగుల్‌మీరా, తాబాసు జ్యోతి, స్వప్న, సాయి శిరణ్మయి, పురుషోత్తం, బాబా తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
సత్తుపల్లి టౌన్, నవంబర్ 30 : పట్టణంలోని వెంగళరావునగర్ 11వ వార్డుకు చెందిన షేక్ గుంషావలీ, బాలాజీ నాగేశ్వరరావు, షేక్ హుస్సేన్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్ షేక్ నాగుల్‌మీరా, మందపాటి రవీంద్రారెడ్డి, దొడ్డాకుల గోపాలరావు, కంటే అప్పారావు పాల్గొన్నారు.
నేడు ఎమ్మెల్యే సండ్ర పర్యటన
తల్లాడ, నవంబర్ 30 : మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం పర్యటిస్తారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్ బుధవారం తెలిపారు. మండలంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తారని తెలిపారు.