‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి మండల తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అర్హులైన పట్టభద్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
– నవంబర్ 6 తుది గడువు.. చివరి వరకు వేచి చూడొద్దు
– కారేపల్లి మండలంలో ఇప్పటివరకు 1,405 మంది మాత్రమే దరఖాస్తు
కారేపల్లి, అక్టోబర్ 26 : ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి మండల తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అర్హులైన పట్టభద్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 2024 ఓటరు జాబితా ప్రకారం కారేపల్లి మండలంలో 2,700 మందికి పైగా ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా,ఇప్పటివరకు కేవలం 1,405 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మండల వ్యాప్తంగా పాత,కొత్త ఓటర్లు కలిపి 3 నుండి 4 వేల మంది వరకు ఎమ్మెల్సీ ఓటర్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు నవంబర్ 6వ తేదీ తుది గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులు చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓటు హక్కు నమోదు చేసుకోవడం ద్వారా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు ఒరిజినల్ డిగ్రీ మెమోతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని వివరించారు. అలాగే దరఖాస్తులో ఈపీఐసీ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని తాసీల్దార్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

