ఖమ్మం, జనవరి 28: సమాజాన్ని మార్చగలిచే శక్తి సాహిత్యానిదేనని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ సాహితీ సంస్థ ‘అక్షరాల తోవ’ ఆరో వార్షికోత్సవ సభ ఖమ్మం రికాబజార్ హైసూల్ ప్రాంగణంలో సంస్థ బాధ్యుడు నామా పురుషోత్తం అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన కథలు, కవితలతో ప్రచురించిన వార్షికోత్సవ సంచికను ప్రముఖ కవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు (వైవీ) ఆవిషరించారు.
అనంతరం మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ సాహిత్యంలో విశేషకృషిని అందిస్తున్న అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ అభినందనీయులన్నారు. కథా విజేతలకు పురసారంతోపాటు నగదు బహుమతులందజేశారు. ప్రముఖ రచయితలు, కవులు, అక్షరాల తోవ నిర్వాహకులు దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, కవులు సయ్యద్ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, కొమ్మవరపు కృష్ణయ్య, మేడగాని శేషగిరి, గద్దపాటి శ్రీనివాస్, షుకూర్, తోట సుభాషిణి, ఇబ్రహీం నిర్గుణ్ తదితరులు పాల్గొన్నారు. మొగిలి గుణకర హస్యవల్లరి, పాగి వెంకన్న, మూస పాటలు సభికులను అలరించాయి.