ఈవీఎం కనెక్షన్‌పై అవగాహన ఉండాలి
ఈవీఎం కనెక్షన్‌పై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆమె పరిశీలించారు.
- ఎన్నికల విధుల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలి
- మొదటి శిక్షణకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్ నోటీసులివ్వాలి
- పీవోలు, ఏపీవోల శిక్షణ తరగతుల్లో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక
పాల్వంచ/ పాల్వంచ రూరల్, ఏప్రిల్ 2: ఈవీఎం కనెక్షన్‌పై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈవీఎం పరికరాల పనితీరు గురించి పీవో, ఏపీవోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని అన్నారు. పోలింగ్ రోజున పూరించాల్సిన 17సీ , పీవో డైరీ, పీవో రిపోర్టులతోపాటు ఈవీఎం కనెక్షన్ మీద స్పష్టమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలని ఆదేశించారు. ఈ రోజున నిర్వహిస్తున్న మొదటి శిక్షణ కార్యక్రమానికి కొత్తగూడెం నుంచి 275 మంది, అశ్వారావుపేట నుంచి 264 మంది, ఇల్లెందు నుంచి 225 మంది, పినపాప నుంచి 260 మంది, భద్రాచలం నుంచి 209 మంది కలిపి మొత్తం 1,233 మంది హాజరుకావాల్సి ఉందని తెలిపారు. అయితే ఇందులో 48 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు దామోదర్‌రావు, కుసుమకుమారి, సుమ, శ్రీనివాస్, వివేక్, ఎర్రం చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

