ఖమ్మం లీగల్, డిసెంబర్ 14: సంపూర్ణ అక్షరాస్యతతోనే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన పారా లీగల్ వలెంటీర్ల శిక్షణా సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులను బాల కార్మికులుగా మార్చొద్దన్నారు.
వారిని బాగా చదివించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతిఒక్కరిని సమానంగా చూడాలన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి అబ్దుల్ జావీద్‌పాషా మాట్లాడుతూ.. పారా లీగల్ వలంటీర్లు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతిఒక్కరూ భాగస్వామలు కావాలన్నారు. కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ పారా లీగల్ వలంటీర్లు, చైల్డ్‌లైన్ జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు.