కొత్తగూడెం ప్రగతి మైదాన్, 6 ఫిబ్రవరి:-తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ కోటర్స్ లో క్రీడలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు గురువారం ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభమైన తొలి క్రికెట్ మ్యాచ్ నీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు టాస్ వేసి ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడల్లో భాగంగా క్రికెట్, సెటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్ 400 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, షాట్ పుట్ వంటి విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచనున్నారు. ఈ సందర్భంగా ఎస్పి రోహిత్ రాజు మాట్లాడుతూ.. నిత్యం పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవలు అందించడంలో నిమగ్నమై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో ఇలాంటి క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా తమ ప్రతిభను కనబరిచి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ఎస్పి రోహిత్ రాజు ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ పోలీస్ స్పోర్ట్స్ మినిట్స్ మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడల్లో కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన అన్ని విభాగాల క్రీడలో పోలీసులు ఆయా సబ్ డివిజన్లకు కేటాయించిన యూనిఫామ్ జెర్సీ తో మైదానాల్లో ఉత్సాహభరితమైన ఒరవడిని నెలకొల్పారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డిఎస్పి షేక్ అబ్దుల్ రహమాన్, పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, వి రవీందర్ రెడ్డి, జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొన్నారు.