భద్రాచలం, డిసెంబర్ 13: నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు స్థలంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీపీఐలో కొనసాగుతున్న రావులపల్లి రాంప్రసాద్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ చేరి తన గెలుపు కోసం శ్రమించారన్నారు.
అలాగే దుమ్ముగూడెం మండలానికి చెందిన పార్టీ నాయకులు ఊరూరా ప్రచారం నిర్వహించి తనను గెలిపించారన్నారు. వారందరీకీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు సునీల్, అన్నెం సత్యాలు, నోముల రామిరెడ్డి, బత్తుల నరసింహులు, ఖాసీం, దొడ్డిపట్ల శివప్రసాద్, విశ్వనాథం, రాము, శ్రీను, అందుర్తి సతీష్, మారెడ్డి గణేష్, కొలిపాక శివ పాల్గొన్నారు.