వైరా ఎమ్మెల్యే రాములునాయక్మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొణిజర్ల, నవంబర్ 3 : తెలంగాణ రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిషలు శ్రమిస్తున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని చిన్నగోపతి, లింగగూడెం, గోపవరం, చిన్నమునగాల గ్రామాల్లో రూ.35.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, చిన్నమునగాలలో నిర్మించే వైకుంఠధామం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాములునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని, నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, వినూత్న కార్యక్రమాల అమలుతో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, అవసరాలు కేసీఆర్‌కు మాత్రమే తెలుసని, తెలంగాణ రాష్ట్ర బంగారు భవిష్యత్ కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఊరూరా పూలవర్షంతో స్వాగతం పలికారు. చిన్నమునగాలలో మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఆయన స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరీక్ష చేయించుకున్నారు.
అనంతరం ఇటీవల మృతిచెందిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ బీడీకే.రత్నం, ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, సహకార సంఘం అధ్యక్షుడు చెరుకుమల్లి రవి, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ కిలారు మాధవరావు, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై.చిరంజీవి, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, దొడ్డపునేని రామారావు, ఏలూరి శ్రీనివాసరావు, పొట్లపల్లి శేషగిరిరావు, డేరంగుల బ్రహ్మం, మీడియా కోఆర్డినేటర్ షేక్ జాన్పాషా, సర్పంచ్‌లు దొండపాటి లక్ష్మి, కాంపెల్లి స్వప్న, రాయల నాగేశ్వరరావు, ఎంపీటీసీ మార్కపుడి అంబేద్కర్ పాల్గొన్నారు.