ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ఓపెన్ టెన్త్‌లో 863 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 349 మంది ఉత్తీర్ణత సాధించి.. 40.44 శాతం నమోదు చేశారు. ఓపెన్ ఇంటర్లో 1,031 మందికి.. 462 మంది ఉత్తీర్ణత సాధించి.. 44.81 శాతం పాస్ అయ్యారు.
పరీక్ష ఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని రెండు జిల్లాల కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు పేర్కొన్నారు. రీ కౌంటింగ్‌కు ఇంటర్లో ఒక సబ్జెక్ట్‌కు రూ.400, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200, పదో తరగతిలో రీ కౌంటింగ్‌కు రూ.350, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు.