ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 9: గ్రామీణ వైద్యుల సమస్యలను శాసనమండలిలో చర్చిస్తానని, రాత్రనక, పగనలక మారుమాల ప్రాంతాల్లో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఆదివారం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మహాసభ ఖమ్మం నగరం బైపాస్‌రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాతా మధు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నిరంతరం సేవచేసే వైద్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ వైద్యులకు బీఆర్ఎస్ అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు. గ్రామీణ వైద్యుల సేవలపై అజయ్ పాడిన పాటల సీడీ, గ్రామీణ వైద్యుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు, సత్యనారాయణ, బెల్లంకొండ మోహన్, వెంకటనారాయణ, బీఆర్ఎస్ నేతలు బెల్లం వేణుగోపాల్, న్యాయవాది మేకల సుగుణారావు, డాక్టర్ పరుచూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ హరిత, వెంకటాచారి, మణికుమార్, సుదర్శన్, రాములు, కృష్ణమూర్తి, భాస్కర్ పాల్గొన్నారు.