మధిర, జూన్ 15 : విమాన ప్రమాదంలో పలువురు మృతి చెందడం బాధాకరమని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి అన్నారు. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అహ్మదాబాద్ లోమృతి చెందిన విమాన ప్రమాద బాధితులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుడు శీలం నరసింహారావు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో దాదాపుగా 250మంది ప్రయాణికులు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు మృతి చెందటం విచారకరమన్నారు. ప్రమాదానికి గల కారణం శాస్త్ర వేత్తలకు కూడా అంతుపట్టడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో చెరుకూరి కృష్ణారావు, పల్లపోతుల ప్రసాద్,వెలివేల శ్రీధర్,గుర్రాల శ్రీనివాసరెడ్డి, కటకం రాంబాబు,ఆదూరి అబ్రహం,వేముల ఆంజనేయులు ,ఊటుకూరి భాస్కరరావు,కంచి పోగు ఆదం,కళ్యాణ పున్నయ్య,తూములూరి రాజా,ఎల్ అప్పారావు,రంగశెట్టి శ్రీను, బనగండ్లపాటి మూర్తి, బజాజ్ సాంబిరెడ్డి, జంగా శ్రీనివాసరెడ్డి, కొలగాని ప్రసాద్, ఇన్ స్టైల్ రాము, చల్ల సత్యనారాయణ, దాచేపల్లి మురళి, దాచేపల్లి రాము, కస్తాల సతీష్, ఏలూరు దుర్గాప్రసాద్, శీలం శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి రవీందర్ రెడ్డి, ఒట్టే సైదులు, సముద్రాల ఉపేందర్, కొత్తూరు నరసింహారావు, నంబూరు మురళి, నీరుకొండ మురళి, యూనియన్ బ్యాంక్ రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.