ఖమ్మం కమాన్బజార్, జూలై 10: విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ.. సుమారు 13 లక్షల మంది విద్యార్థులకు ఇప్పటి వరకు దాదాపుగా రూ.8,158 కోట్లు నిధులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న సీఎం.. మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు వేతనాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.