రఘునాథపాలెం, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో ఖమ్మాన్ని అంధత్వరహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు రైతువేదికలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కంటి వెలుగును చేపట్టి తెలంగాణలో అంధత్వాన్ని నివారించే దిశగా కార్యాచరణ చేశారన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శిబిరం ద్వారా ఉచితంగా కళ్లద్దాలను అందజేయడంతోపాటు ఆపరేషన్లు సైతం నయా పైసా ఖర్చు లేకుండా చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ మీరా సాహెబ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, ఎంపీపీ భూక్యా గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవి, మంచుకొండ వైద్యురాలు నిలోహన, మండల టీఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి మోహన్‌రావు, వెంకటప్పారావు, ఎంపీటీసీ సత్యవతి, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు
– ‘వాడవాడకు పువ్వాడ’లో పాల్గొన్న మంత్రి
‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలో ఉదయం 6:30 నుంచి 9గంటల వరకు మంత్రి పువ్వాడ అజయ్ ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఖమ్మం 6వ డివిజన్ పరిధి ప్రశాంతినగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, దండా జ్యోతిరెడ్డి, కోలేటి రాధాకృష్ణ, గుద్దేటి మాధవరావు పాల్గొన్నారు.
రఘునాథపాలెం/ ఖమ్మం, జనవరి 23 :జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలను అందజేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ భరోసా ఇచ్చారు. సోమవారం టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, సెక్రటరీ చిర్రా రవి ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఖమ్మంలో ఇచ్చిన తరువాత మిగిలిన నియోజకవర్గాల్లో ఇళ్లస్థలాలు అందజేస్తామని చెప్పారు. ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయింపుతోపాటు నిర్మాణానికి నిధులకు కృషి చేస్తానన్నారు. సంఘం టెంజూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, షేక్ జానీపాషా, నగర అధ్యక్షుడు బాలబత్తుల రాఘవ, కోటేశ్వరరావు, గుద్దేటి రమేశ్, కొరకొప్పుల రాంబాబు, జగదీశ్, గోపి, బి.కృష్ణ, పిన్ని సత్యనారాయణ, కట్టెకోల నాగార్జున, వెంకటరమణ, యాదగిరి, అశోక్ పాల్గొన్నారు.