పాల్వంచ రూరల్, డిసెంబర్ 20: పదో రాష్ట్రస్థాయి సోషల్ వెల్ఫేర్ క్రీడలు లక్ష్మీదేవిపల్లి (ఎస్)లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం రెండో రోజుకు చేరాయి. దాదాపు 13 అంశాల్లో వివిధ జోన్ల మధ్య కొనసాగుతున్న ఆటలు ఉత్సాహభరితంగా.. పోటాపోటీగా సాగుతున్నాయి. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్, టెన్నికాయిట్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు ముగిశాయి.
విజేతలకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ సక్రునాయక్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు కంపాటి అలివేలు, కొప్పుల స్వరూపరాణి, కొత్తపల్లి ప్రత్యూష, విద్యారాణి, క్రీడల నిర్వహణ అధికారులు శంకర్, జి.శ్రీనివాస్, కె.వాసు తదితరులు పాల్గొన్నారు.
అండర్-14 రన్నింగ్ విభాగంలో: విశాల్ (జోగులాంబ), నితిన్ (భద్రాద్రి) రాకేష్ (కాళేశ్వరం) జోన్ల క్రీడాకారులు మొదటి మూడు స్థానాలు సాధించారు.
లాంగ్ జంప్‌లో: నితిన్, చరణ్ (కాళేశ్వరం) ప్రవీణ్ (జోగులాంబ) జోన్ల క్రీడాకారులు మూడు స్థానాల్లో నిలిచారు.
షాట్‌పుట్‌లో: మహేష్ (యాదాద్రి), ప్రవీణ్ (జోగులాంబ), తేజ (యాదాద్రి) జోన్ల క్రీడాకారులు విజయం సాధించారు.
5000 మీటర్ల రన్నింగ్‌లో: శివకుమార్ (జోగులాంబ), గోపిచంద్ (యాదాద్రి), అనిల్ (జోగులాంబ) విజయం సాధించారు.
లాంగ్ జంప్‌లో: ఏ.గణేశ్ (జోగులాంబ), ఉదయ్‌కిరణ్ (జోగులాంబ), డి.గణేశ్ (కాళేశ్వరం) జోన్ల క్రీడాకారులు విజేతలుగా నిలిచారు.