‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో...
– తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి
ఖమ్మం రూరల్, అక్టోబర్ 17 : రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మెడకంటి చిన్న వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలోని 16 మండలాల్లో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట నష్ట పరిహారం అందని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతు బీమా ప్రీమియం చెల్లించి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఎల్నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు వరి, మొక్కజొన్న పంటలకు రూ.30 వేల చొప్పున, పత్తి, మిర్చి పంటలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని, సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వరి పంటలో అన్ని రకాల ధాన్యాలకు బోనస్ వర్తింపజేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బానోత్ రామకోటి, వెన్నం భాస్కర్, రామకృష్ణ, రమేష్, రామస్వామి, ప్రభుదాస్, వెంకన్న, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

