రఘునాథపాలెం, జనవరి 1 : నూతన సంవత్సరం 2023 ప్రారంభ వేడుకలు ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్‌లు, స్వీట్ల పంపిణీ, శుభాకాంక్షల అభినందనలతో ప్రజలు ఆనందోత్సాహాలను పంచుకున్నారు. గ్రామగ్రామాన గ్రూపులుగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో యువత సంబురాలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి పలు చర్చిల్లో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
ఆదివారం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకొని ఈ సంవత్సరమంతా శుభప్రదంగా ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. బల్లేపల్లిలో నూతనంగా ఏర్పాటైన ఆటో యూనియన్ అడ్డాలో జరిగిన సంబురాల్లో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అడ్డా అధ్యక్షుడు బాలకృష్ణ, జే శ్రీను, డీ నాగులు, డీ సాయి, జీ ఉపేందర్, ఈ ఉపేందర్, బ్లూరె శ్రీనివాసరావు, బీ సాయి, కోటి, రవి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరం బల్లేపల్లిలో ఖమ్మం నగర రాడ్‌బెండింగ్ మేస్త్రి, వర్కర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను అసిస్టెంట్ లేబర్ అధికారి పీవీకే శాస్త్రి ముఖ్యఅతిథిగా ఆవిష్కరించారు.
ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జీ రామయ్య, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేరబోయిన వెంకన్న, రాడ్‌బెండింగ్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పటేల్, జక్కు భరత్, ఇబ్బడి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రాజు, దాసు, మోహన్‌రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో..
ఖమ్మం, జనవరి 1 : ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కేక్ కట్ చేసి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. బీఆర్ఎస్ దేశ ప్రజల మన్ననలు పొంది విజయఢంకా మోగించాలని అన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమ, దిలీప్, బాజీబాబా, పోట్ల శ్రీను, ముత్యాల వెంకటఅప్పారావు, చుంచు విజయ్‌కుమార్, శివయ్య, మల్లయ్య, వీరన్న, రవి, మీగడ శ్రీనివాస్ కొప్పుల ఆంజనేయులు, చావా వేణు, చామకూరి రాజు, విజయ్ పాల్గొన్నారు.
గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో..
నగరంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు, అర్చకులు వారికి తీర్ధప్రసాదాలు అందజేశారు.
వద్దిరాజు యువసేన క్యాలెండర్ ఆవిష్కరణ
వద్దిరాజు యువసేన ఆధ్వర్యంలో నానబాల హరీష్ రూపొందించిన క్యాలెండర్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. ఖమ్మానికి చెందిన అభిమానులు ఆదివారం పెద్దసంఖ్యలో హైదరాబాద్‌కు వెళ్లారు. బంజరాహిల్స్‌లోని రవిచంద్ర నివాసంలో యువసేన ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వద్దిరాజు యువసేన నాయకులు నానబాల హరీశ్, నచ్చు స్రవంత్, అరవింద్, శ్రీకాంత్, బిందు సారధి, ఉమేశ్, సైదులు, మహేశ్, సాయికిరణ్ పాల్గొన్నారు.
నామా సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాసేవలో నామా సేవా సమితి భాగస్వామ్యం మరింతగా పెరగాలని బీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. నామా సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్‌ను ఎంపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నామా సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, యం.భార్గవ్, దేశభక్తిని నవీన్, జల్లపల్లి ఉపేందర్, శ్రీకాంత్, రాజు, సాయి పాల్గొన్నారు.