రఘునాథపాలెం, అక్టోబర్ 3 : మండలంలోని పుఠానీతండా గ్రామంలో సోమవారం వింత తాబేలు ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన గుగులోతు కస్నా తన చేలో పొలం పనులు చేస్తుండగా నక్షత్ర తాబేలు కనిపించింది.
చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులకు తెలియజేయడంతో తాబేలును చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. తాబేలుపై నక్షత్రాకారంలో ఉండడంతో సోషల్ మీడియాలో పెట్టారు. నక్షత్ర తాబేలు.. ఇంట్లో ఉంటే చాలా మంచిదంటూ చెప్పుకొచ్చారు. చివరకు ఆ తాబేలును రైతు తన ఇంటికి తీసుకెళ్లాడు.