ENG vs PAK | నిప్పులు చెరిగిన ఆర్చర్, రాబిన్సన్.. లార్ట్స్ టెస్టులో 110కే పాకిస్థాన్ ఆలౌట్..!
ENG vs PAK : లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఇంగ్లండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్(4-11), జోఫ్రా ఆర్చర్(3-26)లు నిప్పులు చెరగడంతో రెండో రోజు పాక్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు.
ENG vs PAK : లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఇంగ్లండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్(4-11), జోఫ్రా ఆర్చర్(3-26)లు నిప్పులు చెరగడంతో రెండో రోజు పాక్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. ఓపెనర్ అజాన్ అవైస్(46)కు సహకరించే వాళ్లు కరువయ్యారు. చివరి బ్యాటర్ అబ్బాస్(3)ను ఆర్చర్ ఔట్ చేయడంతో 110 పరుగలకే ఆ జట్టు ఆలౌటైంది. వెంటనే అంపైర్లు టీ బ్రేక్ ప్రటించగా.. సమిష్టి వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు వెనుకంజలో ఉంది పాక్.
తొలి టెస్టులో భారీ విజయంతో జోరుమీదున్న ఇంగ్లండ్ లార్డ్స్‌లోనూ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 290కే ఆలౌటైన ఆతిథ్య జట్టుకు బౌలర్లు మంచి ఆధిక్యాన్ని అందించారు. దాంతో, ఆతిథ్య జట్టును మూడొందలలోపే కట్టడి చేశామని సంబురపడిన పాక్ సంతోషం ఆవిరైంది. ఓపెనర్ షాన్ మసూద్(1) వికెట్‌తో ఇంగ్లండ్‌కు జోఫ్రా ఆర్చర్(3-26) తొలి బ్రేకివ్వగా.. ఆపై ఓలీ రాబిన్సన్(4-11) వికెట్ల వేటతో భయపెట్టాడు.
13 overs. 6 maidens. 11 runs. 4 wickets. Economy: 0.84
Ollie Robinson’s comeback is going from strength to strength 💪 pic.twitter.com/gWWFtaK8FL
— Cricinfo (@cricinfo) August 28, 2026
మరో ఎండ్‌లో జోష్ టంగ్(2-27) సైతం విజృంభించి ఫామ్‌లోలేని బాబర్ ఆజాం(8)ను వెనక్కి పంపాడు. అంతే.. 30 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. కష్టాల్లో పడిన పాక్‌ను రాబిన్సన్, ఆర్చర్ మరింత దెబ్బతీయగా.. తర్వాతి ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఓపెనర్ అజాన్ అవైస్(46) మినహా క్రీజునంటుకొని పోరాడే బ్యాటర్ కరువవ్వడంతో పాక్ ఇన్నింగ్స్ 110 వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 180 పరుగులు వెనకబడింది. పాక్ కుప్పకూలడంతో ఇంగ్లండ్ టీ బ్రేక్ అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టనుంది.
Another miserable batting display from Pakistan, with Azan Awais’ 46 the only real resistance 😨
England claim a first-innings lead of 180 runs at Lord’s #ENGvPAK pic.twitter.com/G7kQNwHCJj
— Cricinfo (@cricinfo) August 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

