దస్తూరాబాద్: కష్టకాలంలో అండగా నిలిచి తమ జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడిపై ఓ చెల్లెలు తన ప్రేమానురాగాలను చాటుకుంది. ఆపద్భాందవుడైన ఆయనకు రాఖీ కట్టి ఆమె మురిసిపోయింది తను. రాఖీ పండుగ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి భూక్యా జాన్సన్ నాయక్‌కు మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి జ్యోతి రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపింది.
రాఖీ పండుగను పునస్కరించుకొని మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి జ్యోతి ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి భూక్యా జాన్సన్ నాయక్‌కు రాఖీ కట్టింది. గతంలో ఉపాధి నిమిత్తం జ్యోతి భర్త రవీందర్ మలేసియాకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అక్కడ ఉపాధి కోల్పోయిన అతడు జైల్లో ఉన్న విషయం తెలుసుకున్న జాన్సన్ నాయక్ వెంటనే స్పందించారు.
తన సొంత డబ్బులతో రవీందర్‌ను మలేసియా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చారు జాన్సన్. తన కుటుంబానికి రుణం తీర్చుకోలేని సహాయం చేసిన ఆయనకు శుక్రవారం రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపింది. జ్యోతి . ‘అన్నా.. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాం’ అని ఈ సందర్భంగా జ్యోతి, రవీందర్ దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు.