Sri Bhadravathi Sametha Bhavana Rushi Swamy | మధిర : మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి కళ్యాణాన్ని వైభవోపేతంగా ఇవాళ అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు. పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతి భావన రుషి స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములను అందజేశారు. కళ్యాణ వేడుకకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఎలమద్ది రాము, బిట్రా ఉద్దండయ్య, పొడుగు వెంకటేశ్వర్లు, జిల్లా నరసింహారావు, ఎన్ఆర్ఐ జల్లా రామకృష్ణ, మిడిదిడ్డి వెంకటనారాయణ, మడిపల్లి గ్రామ పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ సెంటిమెంట్‌తో ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సినిమాలే కాదు.. పాటలు కూడా వచ్చాయని తెలిసిందే. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే జోనర్లో వస్తున్న చిత్రం మాతృ (Matru). జాన్ జక్కీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. శ్రీపద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి శివప్రసాద్ నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి అపరంజి బొమ్మ.. మా అమ్మ పాటను ఇటీవలే లాంచ్ చేశారు. దినేశ్ రుద్ర పాడిన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. మదర్ సెంటిమెంట్‌తో అందరి హృదయాల్ని కరిగించేలా సాగుతూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తుంది.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య