Jamalapuram temple | జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు..

ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఘనంగా పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. మంగళవాయిదాల నడుమ ఆలయ తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణమాసంలో చివరి శనివారం కావడంతో వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
స్వామివారిని, అమ్మవార్లను మేళతాళాలతో మంగళవాయిద్యాతలో పల్లకిలో కళ్యాణవేదిక వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. భక్తులు పాలపొంగళ్లు చేసి స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల కృష్ణమోహనశర్మ, ఈవో జగన్మోహన్రావు, సూపరిండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయకుమారి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

