కొత్తగూడెం క్రైం, జూన్ 7 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9న జిల్లాలోని 21 కేంద్రాల్లో 8,871 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరూ ఆయా కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా తిరగొద్దని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తెరిచి ఉంచొద్దని, బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద తనిఖీ సిబ్బంది అభ్యర్థులు సహకరించాలని, ప్రతి ఒక్కరూ టీజీపీఎస్సీ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.