ఆళ్లపల్లి : భద్రాద్రి కొత్తగూడెం (Badradri Kottagudem) జిల్లా ఆళ్లపల్లి (Allapally) మండలం మర్కోడు గ్రామం (Markodu Village) లోని ప్రాథమిక పాఠశాల (Primary School) లో శుక్రవారం క్షుద్ర పూజల (Black magic) కలకలం రేగింది. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయులు (Teachers), విద్యార్థులు (Students) ఉదయం పాఠశాలకు వచ్చేసరికి క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి.
పాఠశాలలో క్షుద్ర పూజలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే స్కూళ్లో క్షుద్రపూజలు చేసిన వారిని కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.