‘పదవుల’ పందేరం
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
- కార్పొరేషన్ చైర్మన్లుగా ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు
- కాంగ్రెస్‌లో పలువురు సీనియర్లకు మొండిచేయి
- అసంతృప్తిలో మరికొందరు ‘హస్తం’ పార్టీ నేతలు
ఖమ్మం, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన పొదెం వీరయ్యను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి నిమిషం వరకు వేచి చూసిన రాయల నాగేశ్వరరావుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అలాగే డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబును రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించింది. తిరుమలాయపాలెం మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సింగరేణి కార్మిక సంఘం నాయకుడు జనక్‌ప్రసాద్‌ను కనీస వేతనాల చట్టం అమలు సంస్థ చైర్మన్‌గా నియమించింది.
వైరా నియోజకవర్గానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న నాయుడు సత్యనారాయణకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, అదే వైరా నియోజకవర్గానికి చెందిన నూతి శ్రీకాంత్‌ను రాష్ట్ర బీసీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమించింది. ఈ నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందే ఖరారు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. గత మార్చిలో ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో మువ్వా విజయ్‌బాబు పదవి మాత్రమే మారింది. ఆయనకు తొలుత విద్యావనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కేటాయించారు. కానీ.. తాజాగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. కాగా, దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న అనేకమంది సీనియర్లు, మరికొందరు నాయకులు ఈ నామినేటెడ్ పదవులను ఆశించినప్పటికీ వారికి ఆ పదవులు లభించలేదు. దీంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

