కారేపల్లి, జులై 02 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ ఎస్.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి సింగరేణి మండల తాసీల్దార్‌గా ఆయన ఇక్కడికి వచ్చారు. సంపత్‌కుమార్‌ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డీఎస్.లోకేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. సింగరేణి మండల డీప్యూటీ తాసీల్దార్ కృష్ణయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.