‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
కాంగ్రెస్ పాలనలో సింగరేణి మండల అభివృద్ధి శూన్యమని సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే.నరేంద్ర విమర్శించారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తమ పాలనలో సింగరేణి మండలం అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా...
– సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే.నరేంద్ర
కారేపల్లి, అక్టోబర్ 30 : కాంగ్రెస్ పాలనలో సింగరేణి మండల అభివృద్ధి శూన్యమని సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే.నరేంద్ర విమర్శించారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తమ పాలనలో సింగరేణి మండలం అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రూ.100 కోట్లు మంజూరు చేయించి వైరా నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చానని ఎమ్మెల్యే చెబుతున్నారని, అయితే ప్రాజెక్టు కారణంగా సింగరేణి మండలంలోని గిరిజన, గిరిజనేతర పేదల భూములు కోల్పోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం, ప్యాకేజీ అందలేదన్నారు. మండలానికి సాగు, తాగునీరు అందించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
41 గ్రామ పంచాయతీలు, సుమారు 100 గ్రామాలు, లక్ష జనాభా కలిగిన మండలంలో విద్యారంగం పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మండలానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు, బీసీ హాస్టల్, కళాశాల హాస్టళ్లకు సొంత భవనాలు, మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ బాలుర, బాలికల వసతి గృహాల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. వైద్యరంగం పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని, మండల కేంద్రంలో ఉన్న ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎర్రబోడు ప్లాంటేషన్ రైతులకు భూములు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదన్నారు.
పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న రైతులపై కేసులు పెట్టడం ఏమిటని విమర్శించారు. పోడు భూములకు హక్కు పత్రాలు, విద్యుత్ సౌకర్యం, సాగునీటి బోర్ల సాధన కోసం సీపీఎం పార్టీ పోరాటాలు చేసిందని, పార్టీ నాయకులు, పోడు సాగుదారులపై నమోదైన కేసులే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూముల రక్షణకు, సాగుదారులకు హక్కు పత్రాలు కల్పించేందుకు ఎలాంటి కృషి జరగలేదన్నారు. మండల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని చెబుతున్న ఎమ్మెల్యే ఆ ప్రణాళికను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా మిగిలి ఉన్న పదవీకాలాన్ని, అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న అవకాశాలను వినియోగించుకొని సింగరేణి మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని నరేంద్ర కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

