ఉమ్మడి జిల్లాలో శ్రావణమాస బోనాల జాతర మొదలైంది. దానితోపాడు ఆదివారం కూడా కలిసి రావడంతో వివిధ గ్రామాల్లో అమ్మవార్ల బోనాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా కాలనీ ప్రజలు తమ ఇళ్లకు మామిడి తోరణాలను కట్టుకొని అలంకరించుకున్నారు.
మహిళలు ఉదయాన్నే ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక నైవైద్యాన్ని తయారుచేసుకున్నారు. ముందుగా గ్రామాల్లోని బొడ్రాయికి నీళ్లు పోసి పూజలు చేశారు. తరువాత ఆ బోనాలను తలలపై పెట్టుకొని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామ పొలమేరలు, ఆలయాల్లోని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్