Trees Chooped Down | ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని బీరాపల్లి సత్తెమ్మ తల్లి గుడి వద్ద భారీ వృక్షాలు పశువులు, జీవాల కాపలాదారులకే కాక గుడి వద్దకు వచ్చే భక్తులకు సేద తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ భారీ వృక్షాల కింద చిరు వ్యాపారులు సైతం జీవనం సాగిస్తున్నారు. కానీ ఓ ప్రైవేట్ మిల్లుకు విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ ఈ చెట్లను నరికి వేయటం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.
మర్లపాడు – తిరువూర్ రోడ్లో వేంసూర్ మండలం బీరాపల్లిలోని సత్తెమ్మతల్లి గుడి దగ్గర పెరిగిన భారీ వృక్షాలను విద్యుత్‌శాఖ అధికారులు నరికేస్తున్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా చేపట్టిన ట్రీ ప్లాంటింగ్‌తో పెరిగిన వృక్షాలను నరికేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారత ద్వైవార్షిక రాష్ట్రాల అటవీ నివేదిక-2023 ప్రకారం తెలంగాణలో భౌగోళికంగా సుమారు 24 శాతం అడవులు విస్తరించాయి. జాతీయ స్థాయిలో సగటున 21.71 శాతం అటవీ విస్తరణ కంటే తెలంగాణలో ఎక్కువ భూభాగం అటవీ విస్తరించి ఉండటం గమనార్హం. ఇంతకు ముందుతో పోలిస్తే తెలంగాణలో సగటున కి.మీ దూరానికి 100 చదరపు అడుగుల అడవులు నష్టపోయాయని 2023 ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిలో పోలిస్తే తెలంగాణలో అటవీ విస్తీర్ణం పుంజుకోవడం గమనార్హం.