కొణిజర్ల, ఏప్రిల్ 27: సీపీఎం సీనియర్ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, రైతుకూలీ సంఘం నాయకుడు లాలాపురం గ్రామానికి చెందిన సంక్రాంతి మధుసూదన్‌రావు(87) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలు పార్టీలకు చెందిన ప్రముఖులు మధుసూదనరావు మృతదేహానికి నివాళి అర్పించారు. ఎర్రజెండా నీడన నేలకొరిగిన ఎర్రామందారం మధుసూదన్‌రావు అని పలువురు కొనియాడారు.
మధుసూదన్‌రావు మృతదేహాన్ని ఊరేగిస్తూ అనంతరం ఖమ్మంలోని మెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ ర్యాలీ పూర్తయ్యేంత వరకు వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, వివిధ పార్టీల నాయకులు తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు, మల్లెంపాటి వీరభద్రం, భూక్యా వీరభద్రం, తాళ్లపల్లి కృష్ణ, చింతనిప్పు చలపతి, చెరుకుమల్లి కుటుంబరావు, సంక్రాంతి సుబ్బాయ్య, దొడ్డపునేని కృష్ణార్జునరావు, వడ్లముడి నాగేశ్వరరావు, బేగ్ రోశన్, వడ్డే నారాయణరావు, దుర్గాప్రసాద్ ఉన్నారు.